మానసిక రోగులకు చికిత్స, అవగాహన: వైద్యులు సురేష్, రమణ

నవతెలంగాణ- రామారెడ్డి
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం మానసిక రోగులకు చికిత్స, అవగాహన కార్యక్రమాన్ని వైద్యులు సురేష్ ఆధ్వర్యంలో వైద్య నిపుణులు రమణ, మానసిక ఆరోగ్య సామాజిక కార్యకర్త రాహుల్ నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ… మానసిక సమస్యలను వ్యాధిగ్రస్తులు చికిత్స తీసుకోవాలని, వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మతిమరుపు, నిద్రలేమి, అతి నిద్ర, ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలు,- అతి కోపం, మద్యపానం, ధూమపానం  వంటి మానసిక అనారోగ్యంతో ఉన్నవారికి చికిత్స అందిస్తామని, మానసికoగా ఆరోగ్యం కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. మానసిక రోగులకు చికిత్స తో పాటు కౌన్సిలింగ్ కూడా అందిస్తామని, నేరుగా వైద్యులను సంప్రదించాలని, లేదా ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 14 416 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది భీమ్, జానకి, రాజు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love