జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ ను  సందర్శించిన కలెక్టర్,  సిపి

నవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండల కేంద్రం శివారులోని శ్రీగిరి క్షేత్రం సమీపంలో 63వ నంబర్  జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన జిల్లా సరిహద్దు చెక్ పోస్టును మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ కల్మేశ్వర్ సందర్శించారు.లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఏర్పడిన చెక్ పోస్ట్ ను వారు పరిశీలించారు. చెక్ పోస్ట్ గుండా వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని  సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఒక వ్యక్తి 50 వేలకు మించి నగదుతో ప్రయాణం చేయరాదని, అంతకుమించిన డబ్బుతో ప్రయాణం చేయాల్సి వస్తే అందుకు సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.వీరి వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్మూర్ ఏసిపి బస్వారెడ్డి, తహసిల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, కమ్మర్ పల్లి ఎస్ఐbl రాజశేఖర్, తదితరులు ఉన్నారు.
Spread the love