దీర్ఘకాలిక రుణాల పెండింగ్ బకాయి లబ్ధిదారులకు వన్ సెటిల్మెంట్ అవకాశం

– సింగిల్ విండో కార్యదర్శి జే బాబురావు

నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సింగిల్ విండో కార్యాలయంలో దీర్ఘకాలిక రుణాల పెండింగ్ బకాయి లబ్ధిదారులకు వన్ సెటిల్మెంట్ అవకాశాన్ని కల్పించినట్లు సింగిల్ విండో కార్యదర్శి జె బాబురావు మంగళవారం నాడు నవ తెలంగాణతో మాట్లాడుతూ తెలిపారు. ఈ సింగిల్ విండో పరిధిలో 145 మంది వద్ద దీర్ఘకాలిక రుణం కింద వడ్డీ అసలు కలిసి ఏడు కోట్ల 98 లక్షలు బకాయిలు ఉన్నట్లు వివరించారు. 145 మంది పేరా దీర్ఘకాలిక రుణాల కింద అసలు తీసుకున్న రుణం బకాయి 4 కోట్ల 75 లక్షలు ఉన్నట్లు అసలు రుణం వడ్డీతో కలిసి రెట్టింపుకు చేరుకుంది. అసలు అడ్డు కలిసి లెక్కేస్తే 7 కోట్ల 98 లక్షలు బకాయి ఉన్నట్లు ఆయన వివరించారు. ఇలాంటి మొండి బకాయి దారులకు వన్ సెటిల్మెంట్ ద్వారా రుణం కట్టుకునే అవకాశాలు కల్పించడం జరిగిందని దీర్ఘకాలిక రుణాలు పొందిన పెండింగ్ బకాయి లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలని సింగిల్ విండో కార్యదర్శి బాబురావు పెండింగ్ బకాయిదారులను కోరారు వన్ సెటిల్మెంట్ స్కీం ద్వారా పెండింగ్ బకాయి లబ్ధిదారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ అవకాశం మార్చి 31 వరకు ఉన్నందున దీర్ఘకాలిక రుణాల లబ్ధిదారులంతా మొండి బకాయి చెల్లించుకుని రుణ బకాయిలు వన్ సెటిల్మెంట్ ద్వారా ఎంతో లాభం చేకూరుతుందని ప్రతి ఒక్కరూ వన్ సెటిల్మెంట్ స్కీంను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మార్చి 31 చివరి తేదీ కావడం మిగిలిన 10 రోజుల్లో మొండి బకాయి దారులు వన్ సెటిల్మెంట్ ఈ స్కీం అవకాశం మళ్లీ మళ్లీ రాదని మిగిలిన రోజులు సద్వినియోగం పరచుకోవాలని కోరారు.
Spread the love