ఎండిపోతున్న పంటలకు నీళ్లు ఇవ్వండి

నవతెలంగాణ – గోవిందరావుపేట

పంటలు ఎండినా పరవాలేదు వాగుకు నీళ్లు వదులుతున్న అధికారులు పంటలు ఎండిపోతున్నాయి నీళ్లు సరిపడా ఇవ్వండి బాబోయ్ అని రైతులు అరుస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. మండలంలోని లక్నవరం చెరువు కోట కాలువ రబీ తైబంది ఆయకట్టు చివరి భూములకు నీళ్లు అందక వేసిన పంటలు ఎండిపోతున్నాయి. నీళ్లు సక్రమంగా రావాలి అంటే కాలువలు శుభ్రం చేసుకోవాలి అని అధికారుల సలహాలు సూచనలతో ఎకరానికి వెయ్యి రూపాయల పైబడి పోగుచేసి సొంతంగా కష్టపడి కాలువలను శుభ్రం చేసుకుంటే నీళ్లు వదలకుండా అధికారులు మంత్రి చెప్పిందంటూ నీటిని వాగుకు వదులుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మంత్రి  కి సంబంధిత పార్టీకి మేము కూడా ఓట్లు వేశాము మా పంటలు ఎండ పెట్టుకోమని చెప్పిందా అని రైతులు అడుగుతున్నారు అధికారుల దగ్గర ఈ ప్రశ్నకు జవాబు కరువైంది. తైబందీ ప్రకటించింది అధికారులే ఆలస్యంగా నీటిని విడుదల చేసింది అధికారులే సరిపడా నీటిని విడుదల చేయలేక చేతులెత్తేసింది అక్రమ సాగును అరికట్టలేక పోయింది నీటిపారుదల శాఖ అధికారులు వీరి పుణ్యమా అని వేలకు వేలు పెట్టుబడి పెట్టి పొట్టకు వచ్చిన పంటను ఎండ పెట్టుకోవాల్సిన దుస్థితి దాపిరించిందని పసర ఆయకట్టు రైతులు బాగురు మంటున్నారు. 163 వ జాతీయ రహదారి పెట్రోల్ బంక్ వెంబడి కోట కాలువ ఆయకట్టు సుమారు 50 ఎకరాల పైబడి నీరు అందక రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తెలుపుతున్నారు. అటువంటప్పుడు తై బంది ప్రకటించకుండా ఉంటే బాగుండేదని రైతులు అంటున్నారు. వర్షాకాలం నీళ్లకు వేల రూపాయలు పెట్టి కాలువలు బాగు చేసుకున్నాం మళ్లీ యాసంగి వేలకు వేలు రూపాయలు పెట్టి కాలువలు బాగు చేసుకుంటున్నాం ప్రభుత్వం కాంట్రాక్టర్ల పేరు మీద బిల్లులు చేసి పర్సంటేజీలు తీసుకుంటూ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. వేలకు వేల రూపాయలు ఖర్చు చేసిన పొలం పారుతుందా అంటే అది లేదు సొమ్ము పోయే శని పట్టే అన్నట్టుగా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. గతంలో ఒకసారి అరిచి మొత్తుకుంటే ఓ మాదిరిగా నీటిని విడుదల చేసిన అధికారులు ఇప్పుడు తమ గోడును పట్టించుకోవడం లేదని అంటున్నారు.  ఈ విషయమై నీటిపారుదల శాఖ ఏఈని వివరణ కోరగా నీటిని విడుదల చేశామని సాయంత్రం లోగా నీరు అందుతుందని చరవానిలో తెలిపారు. తీరా రైతులు అక్కడకు వెళితే సద్దిమడుగు తూములు బంద్ చేసి జెసిబి సహాయంతో దయ్యాలవాగుకు నీటిని వదులుతున్నారని ఇది ఎంతవరకు న్యాయమని రైతులు అంటున్నారు. గతంలో వ్యవసాయం చేయాలన్న సంతోషం ఉండేదని ఇప్పుడు వ్యవసాయం చేయాలంటేనే ఒక రకమైన భయం రైతులను వెంటాడుతోందని మోపిదేవి రామకృష్ణ అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంటలు ఎండిన పరవాలేదు దయ్యాలవాగుకు నీరు వదలమని చెప్పడం సమంజసం కాదని ఒకరికి అన్యాయం ఒకరికి న్యాయం కాదని అందరిని సమానంగా చూడాలని అన్నారు.
Spread the love