టెన్త్ విద్యార్థులకు పెన్నులు పంపిణీ

నవతెలంగాణ – మల్హర్ రావు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభ సభాధిపతి స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు స్మారకార్థము 2024 విద్యా సంవత్సరంలో పదవ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు బూడిద దుర్గ వెంకట్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ బూడిద మల్లేష్ పెన్నులు పంపిణీ చేసి తెలంగాణ ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇందారపు వంశీకృష్ణ, ఇందారపు ప్రమోద్ కుమార్, బందెల వరుణ్ పాల్గొన్నారు.
Spread the love