నాసిరకంగా సీసీ రోడ్ల నిర్మాణ పనులు

– సీపీఐ(ఎం) నాయకులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద 40 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి సిసి రోడ్ల నిర్మాణం నిమిత్తం ఎనిమిది సీసీ రోడ్లు మంజూరు కాగా ఆట్టి సీసీ రోడ్లను గ్రామపంచాయతీ అధికారులు పనులు నిర్వహించాల్సి ఉండగా కమిషన్లు కక్కుర్తి పడి గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ బినామీలకు అప్పజెప్పగా వారు సిసి రోడ్డును నాసిరకంగా పోయడం జరిగిందనీ సీపీఐ(ఎం) నాయకులు తెలిపారు. మంగళవారం సిసి రహదారుల నిర్మాణాలను నాయకులు పరిశీలించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ వరదల్లో కొట్టుకొచ్చిన నాసిరకం ఇసుకను సీసీ రోడ్ల నిర్మాణంలో ఉపయోగించడం జరిగింది ఇట్టి విషయాన్ని స్థానిక ఏఈ కి తెలియజేసినప్పటికీ కూడా అతను పట్టించుకోలేదు 12 ఫీట్ల మూడు ఇంచులు పోయవలసిన సిసి రోడ్డుని 12 ఫీట్లు మాత్రమే పోయడం జరిగింది. ఏడు ఇంచుల మందం పోయవలసిన దానిని 6 ఇంచులు మాత్రమే పోయడం జరిగింది. అంతేకాకుండా రోడ్డు పోసిన తెల్లవారే రోడ్డు మొత్తం పగిలిపోవడం జరిగింది. రోడ్డు వేసిన మూడు రోజులకు కూడా నీటితో క్యూరింగ్ చేయటం లేదు. స్థానిక ప్రజలు ఇట్టి విషయాన్ని నిలదీయగా మీరు ఏమన్నా ఏ ఈ ల డి ఈ డి ఈ  ల అంటూ బినామీ కాంట్రాక్టర్ దుర్భాషలాడుతున్నాడు.ఇట్టి విషయంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇట్టి విషయంపై  కలెక్టర్ కి కలిసి మెమోరాండం  సమర్పించి విజిలెన్స్ విచారణకు చేపట్టాలని తెలియజేస్తామని గ్రామ ప్రజలు చెప్పటం జరిగింది. ఇట్టి రోడ్ల విషయంలో నాసిరకంగా పనులు చేపట్టినటువంటి గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మరియు వర్క్ ఇన్స్పెక్టర్ ఏఈ మరియు డి ఈ ల  పై శాఖా పరమైన చర్యలకు ఆదేశించాలని కలెక్టర్  కి వినతి పత్రం సమర్పిస్తామని గ్రామ ప్రజలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బీరెడ్డి సాంబశివ, పొద్ధిల్లా చిట్టిబాబు, తీగల ఆగిరెడ్డి స్థానికులు ఎర్రవెల్లి రాజు, చలగొండ వెంకన్న, కడారి వెంకటేష్,ఎండీ జానీ , చింటూ, కొప్పరి ప్రసాద్ ప్రసాదు, షారుఖాన్, యన్ రాజు  తదితరులు పాల్గొన్నారు.
Spread the love