వ్యవసాయ విద్యార్ధుల క్షేత్ర సందర్శన

నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక వ్యవసాయ కళాశాల ద్వితీయ సంవత్సర విద్యార్థులు క్షేత్ర సందర్శనలో బాగంగా సత్తుపల్లి మండలం, సత్యనారాయణపురం లోని ఎస్కేఎస్బీ  పేరుగల ఒక ప్రైవేట్ నర్సరీని మంగళవారం కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ పర్యవేక్షణలో సందర్శించారు.  ఈ క్షేత్ర సందర్శన లో భాగంగా నర్సరీ లో గల వివిధ మొక్కలు, వాటిని పెంచే విధానాలు, పలు రకాల హైబ్రిడ్ ల గురించి తెలుసుకున్నారు. ప్రధానంగా ఈ నర్సరీ లో వక్క మొక్కలను సాగు చేస్తున్నారు. వక్కతో పాటు అరటి, జాజిపత్రి, కాశ్మీర్ ఆపిల్, మాంగో స్టీన్, ఏలకులు మొదలగు వివిధ రకాల మొక్కలను సాగు చేసి విక్రయిస్తున్నారు. ఉద్యాన పంటల లోని లోటుపాట్లను, లాభాలను, సాగు విధానాలను, యాజమాన్య పద్ధతులను నర్సరీ యజమాని బాజీ విద్యార్థులకు వివరించారు. ఉద్యానవన సహాయ ఆచార్యులు డాక్టర్ నీలిమ ఈ క్షేత్ర సందర్శనను సమన్వయ పరిచారు.
Spread the love