రెండో రోజుకు చేరిన పది పరీక్షలు.. ఐదుగురు గైర్హాజర్

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 18 సోమవారం ప్రారంభం అయ్యాయి. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో రెండు,మండల పరిధిలోని సున్నం బట్టి లో ఒక కేంద్రం లో మొత్తం మూడు కేంద్రాల్లో 641 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా మంగవవారం జరిగిన  హింది సబ్జెక్టు పరీక్షలో మొత్తం మూడు కేంద్రాల పరిధిలో  ఐదుగురు మాత్రమే గైర్హాజర్ అయ్యారు. అశ్వారావుపేట జెడ్పీ హెచ్ ఎస్ (09051) లో 230/229, జెడ్పీ జీ హెచ్ ఎస్ (09052) లో 223/227, సున్నం బట్టి ఎ హెచ్ ఎస్(09053) లో 136/136 మంది విద్యార్ధులు పరీక్షలు రాసారు. ఈ పరీక్షలను సీ.ఎస్, డి.ఓ లు గా హరిత, ప్రసాద్, షాహినా బేగం, టి. శ్రీనివాస్, సి.హెచ్ వెంకయ్య, కే ఆర్సీ ప్రసాద్ లు పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద నిఘాను ఎస్.హెచ్.ఒ, ఎస్ఐ శ్రీరాముల శ్రీను, ఎస్.ఐ శివరాం క్రిష్ణ లు పర్యవేక్షించారు.
కేంద్రం                  ఎలాట్మెంట్  ప్రజెంట్   ఆబ్సెంట్    
జెడ్పీ హెచ్ ఎస్ 
(09051)               230          229             001
జెడ్పీ జీ హెచ్ ఎస్
(09052)                227         223             004
ఎ హెచ్ ఎస్ 
(09053)                136          136            000
Spread the love