ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్

నవతెలంగాణ – హైదరాబాద్: గురువారం సాయంత్రం చెంగిచెర్ల వెళ్లనున్నట్లు ప్రకటించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు రాజాసింగ్ తన కార్యాలయంలో మాట్లాడారు. హోలీ పండుగ రోజు చెంగిచెర్ల లో హిందువులపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టారని ఆరోపించారు. హిందువులపై వందల మంది దాడి చేయటం అన్యాయమన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు ,రేవంత్ రెడ్డి పాలనకు తేడా లేదని, కేసీఆర్ హాయాంలో జరిగినట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎం ఐఎం అధ్యక్షుడు ఓవైసీ ఆదేశానుసారం నడుస్తుందని తెలిపారు. గురువారం సాయంత్రం చెంగిచర్ల బాధితులకు నిత్యావసరాలు తీసుకు వెళ్లేందుకు సిద్ధమవడటంతో పోలీసులు హౌజ్ అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.

Spread the love