దోపిడీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి : తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హన్మకొండలో పార్టీ ఆఫీస్ ప్రారంభం.. మీడియా సమావేశం
నవతెలంగాణ- వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి/ హనుమకొండ చౌరస్తా
సీతమ్మ సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీ చేస్తున్నారని, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వచ్చిన డైరెక్షన్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క ఈ దోపిడీని కొనసాగిస్తున్నారని టీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హనుమకొండలో ఆ పార్టీ జిల్లా కార్యాలయాన్ని శనివారం కవిత ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సీతమ్మ సాగర్ బ్యాక్ వాటర్ నుంచి 70 కిలోమీటర్ల మేర ఇసుక దోపిడీ చేస్తున్నారని తెలిపారు. వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.తెలంగాణ వచ్చాక వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీలకు ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ విద్యా సంస్థ రాలేదని అన్నారు. విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి కల్పన విషయంలో తెలంగాణకు ఏం మంచి జరగలేదన్నారు. జిల్లాల విభజనతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అతిపెద్ద మున్సిపాలిటీకి కనీసం కమిషనర్ లేరని, కలెక్టర్‌కే బాధ్యతలు అప్పగించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించుకున్నా మన్న ప్రశ్న ఇప్పటికీ ప్రతి మేధావినీ వేధిస్తోందని, కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు.మిల్లర్లు రైతులను దోచుకుంటే.. మిల్లర్లను ఈ ప్రభుత్వం దోచుకుంటోం దని అన్నారు. 4500 ఓపీ ఉండే ఎంజీఎం ఆస్పత్రిలో గతంలో ముగ్గురు సూపరింటెండెంట్లను నియమించి.. ఇప్పుడు ఒక్కరు కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 90 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరారు. జులై 2న ఉప్పల్ భగాయత్‌లో ఉద్యమకారులకు స్థలాల అంశంపై పోరాటం చేస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ నడిపెల్లి వెంకటేశ్వర రావు, నిశాంత్‌రావు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, రాష్ట్ర పరిశీలకులు ఇస్మాయిల్, నాయకులు డేవిడ్, శ్రీశైలం, రవికుమార్, సోల్తీ కిషోర్, బోడ అనిల్ నాయక్, మల్లేష్, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇసుక తవ్వకాల్లో మంత్రుల హస్తం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



