ఆరోగ్య రంగంలో దేశంలో గణనీయమైన పురోగతి : రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా
హైటెక్ సిటీ యశోద ఆస్పత్రిలో ‘‘ఆరోగ్య పర్యావరణ సుస్థిరత’’పై అంతర్జాతీయ సదస్సు
నవతెలంగాణ-మియాపూర్
ఆరోగ్య పర్యావరణ సుస్థిరత, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద ఆస్పత్రిలో శనివారం ‘‘ఆరోగ్య పర్యావరణ సుస్థిరత’’పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ హాజరై ప్రసంగించారు. గాలి కలుషితమైతే మన ఆరోగ్యా నికి హాని జరగడమే కాకుండా, ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, వృద్ధులు, పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. వరదలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఆరోగ్య సేవలపై అదనపు ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. అందువల్ల వాతావరణ మార్పు అనేది పర్యావరణా నికి సంబంధిం చిన విషయం మాత్రమే కాదు, అది మన ఆరోగ్యానికి సంబంధించినది కూడా అని అర్థం చేసుకోవాలన్నారు. కొన్నేండ్లుగా ఆరోగ్య రంగంలో భారతదేశం గణనీయమైన పురోగతిని సాధించిం దన్నారు. ఆయుష్మాన్ భారత్, డిజిటల్ హెల్త్ సర్వీసెస్, వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌లు, ఆరోగ్య సౌకర్యాల విస్తరణతో కోట్లాది మందికి ప్రయోజనం చేకూర్చాయని చెప్పారు. ఐఆర్ డీఏఐ చైర్మెన్ అజయ్ సేథ్ మాట్లాడుతూ.. ఆరోగ్య సేవలు, వైద్య విద్య, సాంకేతికత, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణ దేశంలోనే ప్రముఖ స్థానాన్ని అందుకుందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నేడు దేశంలోని ప్రధాన ఆరోగ్య కేంద్రాలలో ఒకటిగా నిలిచిందన్నారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ సదస్సు నిర్వహిం చడం సంతోషంగా ఉందన్నారు. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ సంజయ్ జోద్పాయ్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ఆరోగ్య సంస్థలు ముఖ్యమైన పాత్ర వహిస్తాయని తెలిపారు. శక్తిని ఆదా చేయడం, నీటిని ఆదా చేయడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, వనరులను తెలివిగా ఉపయోగించడం, ఈ దశలన్నీ ఆరోగ్యకరమైన, మెరుగైన భవిష్యత్‌ను తీర్చిదిద్దే అవకాశం ఉందన్నారు. యశోద ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.సురేందర్ రావు మాట్లాడుతూ.. మన పర్యావరణం సురక్షితంగా ఉన్నప్పుడే అభివృద్ధి కల నెరవేరుతుందని, ఆరోగ్యం, పర్యావరణం ప్రత్యేక అంశాలు కావని, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కూడా సృష్టించుకోవాలని సూచించారు. ఈ అంతర్జాతీయ సదస్సులో జరిగే చర్చలు భారతదేశ ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టంగా, స్థిరంగా భవిష్యత్‌కు సిద్ధంగా ఉంచడంలో సహాయపడ తాయని ఆశించారు. అలెగ్జాండర్ థామస్ మాట్లాడుతూ.. ఈ సదస్సు వల్ల దేశ ఆరోగ్య రంగంలో సానుకూల మార్పులు వస్తాయని, ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రత్యేక సదస్సులు నిర్వహించి సమాజంలో మార్పు తేవడానికి ప్రయత్నం చెయ్యాలని కోరారు. ఈ సదస్సులో డాక్టర్ మంతా రమేష్, డాక్టర్ రజని, డాక్టర్ రాజీవ్, డాక్టర్ అశ్విన్ , డాక్టర్ కీర్తన, డాక్టర్ ఆకాష్, డాక్టర్ ప్రకాష్, డాక్టర్ నోర్లీ గ్రేస్, శాంతి భట్టాచార్య, డాక్టర్ ప్రకాష్, డాక్టర్ ఎమిలీ, డాక్టర్ నిక్ థార్ప్ తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



