పరిహారం, పునరావాసం లేకుండా కూల్చివేతలు వద్దు : మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి
దిలీప్ కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్
హైడ్రా ఏర్పాటు ఒక సానుకూల పరిణామమనీ, అయితే పరిహారం, పునరావాసం వంటివి లేకుండా కూల్చివేతలు జరపొద్దని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర లోక్‌దళ్ (టీఆర్‌ఎల్‌డీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ హోటల్ సెంట్రల్ కోర్టులో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంచి పని చేస్తున్నారనీ, అయితే పేదల నివాసాలను తగిన పరిహారం, పునరావాసం కల్పించకుండా కూల్చివేయొద్దని చెప్పారు. హైడ్రా చెరువులు, కుంటల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్న సంస్థ అనీ, ఏ రాజకీయ పార్టీ లేదా వ్యక్తి ప్రభావానికి లోనుకాదని తెలిపారు. చెరువులు, కుంటల సంరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఐఎఫ్‌ఎస్ పర్గైన్ సూచించారు. బలహీన వర్గాల విషయంలో హైడ్రా కమిషనర్ జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త అదూరి కరుణ, మాజీ ఐఏఎస్ వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎల్‌డీ పొలిట్‌బ్యూరో సభ్యులు వి.వి.ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
హైడ్రా ఏర్పాటు సానుకూల పరిణామం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



