మండలంలోని కాటాపూర్ ప్రాంతంలో గల వివిధ గ్రామాలకు నాలుగు రోజులపాటు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా బంద్ అవుతాయని సంబంధిత శాఖ ఏఈ రాంచరణ్ తెలిపారు. శనివారం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాడ్వాయి మండల కేంద్రంలో జాతీయ రహదారి వెడల్పు పనులు ముమ్మురంగా సాగుతున్నందున కాటాపూర్ వైపు వెళ్లే పైపులైను మరమ్మతులు చేపడుతున్నారని వివరించారు. దీంతో మరమ్మతులు పూర్తయ్యేవరకు కాట్టాపూర్ ప్రాంతానికి నీళ సరఫరా బంద్ అవుతుందని దీనిని ఆయా గ్రామస్తులు ప్రజాప్రతినిధులు గమనించాలని ఆయన కోరారు.