స్కూల్ గేమ్స్ రాష్ట్ర బేస్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు మిట్టపల్లి క్రీడాకారులు..


నవతెలంగాణ డిచ్ పల్లి: ఈనెల 16 నుండి 18 వరకు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లోజరుగుతున్న 67వ రాష్ట్ర స్కూల్ గేమ్స్ బేస్ బాల్ అండర్-17 పోటీలకు డిచ్ పల్లి మండలం లోని మిట్టపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ క్రీడాకారులు బాలుర విభాగంలో రాథోడ్ మురళి, కొమిరె విష్ణు, బాలికల విభాగంలో కొమిరె గంగా జమున, గాండ్ల రసజ్ఞ పాల్గొంటున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుశీల్ కుమార్, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు మర్కంటి గంగా మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రధానోపాధ్యాయులు సుశీల్ కుమార్ ఉపాధ్యాయ బృందం అభినందిస్తూ రాష్ట్రస్థాయిలో రాణించి జాతీయ పోటీలకు ఎంపిక కావాలన్నారు. 67వ స్కూల్ గేమ్స్ రాష్ట్ర బేస్ బాల్ అండర్ 17 పోటీలకు ఎంపికైన మిట్టపల్లి పాఠశాల క్రీడాకారులు.

Spread the love