బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ 

నవతెలంగాణ-బెజ్జంకి 

మండల పరిదిలోని వీరాపూర్,గాగీల్లపూర్ గ్రామాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన చిలుముల పవన్,తూముల రాములు,మేడి చంద్రవ్వ మృతి చెందగా శనివారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు ఎమ్మెల్యే రసమయి సీఎంఆర్ఎఫ్ చెక్కులందజేశారు.అయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,బీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love