Saturday, August 1, 2026
E-PAPER
Homeఆదిలాబాద్రహదారుల నిర్మాణంపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి..

రహదారుల నిర్మాణంపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి..

- Advertisement -

– రూ.98 లక్షలతో పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామరావు పటే ల్..
నవతెలంగాణ-కుభీర్
మహారాష్ట్ర కు సరిహద్దు మండలమైన  కుభీర్ మండలంలో ప్రధాన రహదారుల నిర్మాణం పై దృష్టి సారించనున్నట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు. శనివారం మండల కేంద్రమైన కుభీర్ నుండి దోడర్న తండా 2 వరకు పనులకు  98 లక్షల నాన్ గ్రాంట్ ప్లాన్ నిధులతో మండల నాయకులతో కలసి పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రహదారి నిర్మాణానికి నిధులు సరిపోవని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తేవడంతో  కోటీ రూపాయల నిధులు మాంజురు చేయనున్నట్లు తెలిపారు.ఇప్పటికి  మలేగాం మొండి బాస్మన్నా నుండి మహారాష్ట బోర్డర్లో ఉన్న నిగ్వ వరకు 22 కోట్ల నిధుల తో పనులను ప్రారంభించడం జరిగిందన్నారు.

అదే విదంగా 42 కోట్ల హమ్ నిధులతో ప్రసిద్ధి గాంచిన మహారాష్ట్ర లోని పాలజ్ వెళ్లే రోడ్డు వైపున ఉన్న సిరిపెల్లి నుండి పల్సి పార్డి (కే )మీదుగా కుభీర్ వరకు రెండు వరుసల లైన్ రోడ్డు త్వరలోనే వేయిస్తామన్నారు .దానికి సంబంచిన టెండర్ ప్రక్రియ సైతం పూర్తి కావడం జరిగిందన్నారు అనంతరం ఎమ్మెల్యే కు శాలవా పూల మాలతో సన్మానించారు .కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చెర్మన్ కళ్యాణ్ బీజేపీ మండల అధ్యక్షులు ఏశాల దత్తాత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు బషీర్, బంక బాబు, మాజీ మండల అధ్యక్షులు బి విఠల్, నగేష్,సర్పంచు ల సంఘం అధ్యక్షులు తోకల మారుతీ కుభీర్ సర్పంచ్ కందురు సాయినాథ్ ఆత్మ కమిటీచర్మన్ వివేకానంద ఆర్ అండ్ బి అధికారులు,సీనియర్ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -