మా చిరకాల కోరిక తీర్చిన ఎమ్మెల్యే

– ప్రత్యేకంగా ధన్యవాదాలు రాచూర్ సర్పంచ్ పార్వతిబాయి శంకర్ పటేల్

నవతెలంగాణ -మద్నూర్
ఊరు పుట్టిన నాటి నుండి దేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు గడిచిన బీటి రోడ్డు నిర్మాణంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా మా గ్రామానికి చిరకాల కోరిక అయినా బీటీ రోడ్డు మంజూరు. చేయడంలో ఇంతవరకు నిర్లక్ష్యమే జరిగినా ప్రస్తుతం జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే మా గ్రామానికి అతి ముఖ్యమైన బీటీ రోడ్డు సమస్య తీర్చడానికి 161 వ జాతీయ రహదారి నుండి రాచూరు గ్రామం వరకు వీటి రోడ్డు నిర్మాణం కోసం రెండు కోట్ల 70 లక్షల నిధులు మంజూరు చేయించినందుకు గ్రామ ప్రజలు తరఫున గ్రామ సర్పంచ్ గా ఎమ్మెల్యే హనుమంతు షిండే కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మా చిరకాల కోరిక వీటి రోడ్డు సమస్యని మీరు తీర్చినందుకు మీకు ఎల్లవేళల రుణపడి ఉంటామని సర్పంచ్ ఎమ్మెల్యేతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తపరిచారు.
Spread the love