
ఆత్మకూరు మండలానికి చెందిన ఏరుకొండ రాజేష్ అమెరికాలో మృతి పట్ల పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రాజేష్ మృతి పట్ల ఆయన వెంటనే స్పందించి రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి కార్యాలయం తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే. రాజేష్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటాం అని-పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేష్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి మూడు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురై వెంటనే రాజేష్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు తాను అన్ని విధాలుగా కృషి చేస్తానని మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని వారి కుటుంబ సభ్యులను ఆయన కోరారు. అనంతరం వెంటనే హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, ముఖ్యమంత్రి కార్యాలయం తో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఫోన్లో మాట్లాడి రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి త్వరితగతిన తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరినట్లు అలాగే తాను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మాట్లాడి రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేలా కృషి చేస్తానన్నారు. ఉన్నత చదువులు, మంచి ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లిన రాజేష్ విగత జీవిగా తిరిగి రావడం బాధాకరమని వారి కుటుంబంలో తీరని. విషాదం నెలకుంటోందని కాంగ్రెస్ ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.