హైదరాబాద్ : వివిధ సంక్షేమ పథకాలతో దేశంలోనే ఆదర్శ పాలన సాగిస్తున్న కేసీఆర్‌పై అవినీతి, కుటుంబ పాలన అంటూ.. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ విమర్శిం చారు. అంబర్ పేటలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ వ్యాఖ్యలను ఖండించారు. విభజన హామీలు అమలు చేయలేని ప్రధాని రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి ఇక్కడి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలడం, అసత్యాలు మాట్లాడడం అలవాటుగా మారిందని విమర్శించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ, నది జలాల పంపిణీ పై తేల్చకుండా ఉత్త చేతులతో వెళ్తున్నా తలసరి ఆదాయం పెంపు వ్యవసాయ, ఐటీ రంగాల్లో అభివద్ధిలో ఉందన్నారు. రైతులు పేదల అభివృద్దికి సీఎం కేసీఆర్ ఉచిత విద్యుత్ , రైతు బీమా, రుణమాఫీ కల్యాణ లక్ష్మి పథకాలతో ఆదర్శ పాలన సాగిస్తున్నరని, అధికార దాహంతో ప్రజల మధ్య విభేదాలు సష్టించే బీజేపీని రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
మోడీ వ్యాఖ్యలు దిగజారుడు తనానికి నిదర్శనం : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్

Related posts: