డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేయాలని మంత్రిని కలిసిన ఎమ్మెల్యే కుంభం..

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ :  భువనగిరి నియోజకవర్గంలోని  డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసి, పెండింగ్లో ఉన్న వాటికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సోమవారం రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి విన్నవించారు. భువనగిరి నియేజకవర్గంలోని సింగన్నగూడెం, హుస్సేనాబాద్, కొండమడుగు, బీబినగర్, రేవణవల్లి, జిబ్లాక్ పల్లి నందుగల అసంపూర్తిగా వున్న 641 డబుల్ బెడ్రూం ఇండ్లకు పెండిగ్ లో వున్న పనులను పూర్తి చేయుటకు 4.62కోట్ల నిదులను మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. మంత్రి స్థానుకూలంగా స్పందించారని త్వరలో నిధులు విడుదల చేస్తారని అన్నారు.
Spread the love