మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన చింతిరెడ్డి,అమృతమ్మ  మరియు తాడికల్ గ్రామంలో ట్యాంకర్ బోల్తాపడి రోడ్డు ప్రమాదంలో పుదరి శ్రీనివాస్,ఇటీవల మరణించగా బుధవారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ మృతికి గల కారణాలు తెలుసుకొని  శ్రీనివాస్ పిల్లలను ఓదార్చి అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా కల్పించారు. ఎమ్మెల్యే తో పాటు టీపీసీసీ సభ్యులు మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుగోపగాని బసవయ్య గౌడ్,సోషల్ మీడియా ఇన్ఛార్జి మధుకర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,కీసర సంపత్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి ఇస్సామోద్దీన్, రాజయ్య, లు ఉన్నారు.
Spread the love