శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని కన్నాపూర్  గ్రామంలో బుధవారం శ్రీ వాలిసుగ్రీవ ఆంజనేయ సీతారామ స్వామి కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే  కవ్వంపల్లి సత్యనారాయణ హాజరవగా గ్రామ ప్రజలు, ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమైన శ్రీ సీతారామచంద్రస్వామి కన్నాపూర్  గ్రామంలో కొలువై ఉండడం గ్రామస్తుల పుణ్యఫలం అని ఆయన అభివర్ణించారు.స్వామి ఆశీస్సులు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం  ముత్తారం గ్రామంలో సీతారామస్వామిని దర్శించుకుని, ఎల్లమ్మ జాతరలో,మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొప్పగాని బసవయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతి,మహిళా అధ్యక్షురాలు చింతి రెడ్డి పద్మా రెడ్డి,కన్నాపూర్  మాజీ సర్పంచ్ లు తాటికొండ సదానందం,కాల్వ  పాపి రెడ్డి, కాటం వెంకటరమణారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ అడితం కుమార్,దేవునూరి కిష్టయ్య,గండికోట రవి,దేవునూరి వెంకటేష్,అడితం కుమార్, రెడ్డి పవన్ కుమార్, దేవునూరి అఖిల్, నేరెళ్ల సంతోష్,గ్రామ ప్రజలు, మహిళా మణులు, ఆంజనేయ స్వామి భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love