రహదారి పక్క తోపుడు బండి వద్ద టిఫిన్ చేస్తున్న ఎమ్మెల్యే జారే

– ఎమ్మెల్యే సాదారణ జీవనశైలి..
– అనుచరులతో టిఫిన్ చేస్తున్న జారే..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రస్తుతం నడుస్తున్న ఆధునిక జీవనం శైలికి తగ్గట్టుగా సాధార పౌరులు సైతం హై ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తుంటారు. ఇక ఒక మోస్తరు స్థానిక ప్రజాప్రతినిధుల జీవన శైలిని ఊహించడం కష్టం.అలాంటిది ఒక ఎమ్మెల్యేని ఇలా తోపుడు బండి వద్ద టిఫిన్ చేస్తున్నారంటే నమ్మశక్యం కాదు. కానీ ఇది నిజం. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆంధ్ర ప్రదేశ్,క్రిష్ణా జిల్లా,విసన్నపేట వివాహానికి  వెళ్తూ మార్గం మధ్యలో ఖమ్మం జిల్లా,సత్తుపల్లి మండలం బుగ్గపాడులో రోడ్ పక్కన తోపుడు బండి వద్ద తన అనుచరులతో టిఫిన్ చేస్తున్న దృశ్యం ఇది. ఎమ్మెల్యేని అనే ఏ మాత్రం అహం ప్రదర్శించకుండా సాధారణ వ్యక్తిలా అనుచరులతో ఆకలి తీర్చుకుంటూ స్థానికులను,అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ కొద్దిసేపు గడిపారు. ఆయన వెంట అశ్వారావుపేట కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయక గణం జూపల్లి ప్రమోద్,సూరపనేని ఫణి, శ్రీకాంత్, కంచర్ల బాబీ, రాజేష్, మధుర నవీన్, తదితరులు ఉన్నారు.
Spread the love