పాత్రికేయుడికి అండగా ఉంటా : ఎమ్మెల్య పాడి కౌశిక్ రెడ్డి

నవతెలంగాణ – వీణవంక
తీవ్రంగా అనార్యోగ్యానికి గురైన పాత్రికేయుడు పత్తి కొండాల్ రెడ్డికి అండగా ఉంటానని, ఆయన చికిత్సకు తనవంతు సహాయ సహకారాలను అందిస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొంది ఇంటికి వచ్చిన కొండాల్ రెడ్డిని ఆయన గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అతడికి మెరుగైన వైద్యం కోసం తనవంతు సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీల కుమారస్వామి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతాశ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ ఆనందం రాజమల్లయ్య, మాజీ ఎంపీటీసీ గెల్లు మల్లయ్య, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి మహేష్ గౌడ్, నాయకులు గొడుగు రాజు, రెడ్డిరాజుల రవి, కర్ర కొండల్ రెడ్డి, రాయిశెట్టి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love