Monday, August 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్సవ విగ్రహాలుగా సంచార పశువైద్యశాల వాహనాలు 

ఉత్సవ విగ్రహాలుగా సంచార పశువైద్యశాల వాహనాలు 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను 
పశు సంచార వైద్యశాలలు ఉత్సవ విగ్రహాలుగా ఉన్నాయని, గొర్రెలు, మేకల పెంపకందారులు, పశుపోషకులకు అందుబాటులోకి తీసుకురావాలని, జీఎంపీస్ జిల్లా అధ్యక్షుడు మద్దెపురం రాజు అన్నారు. ఆలేరు పట్టణంలో సోమవారం పశువైద్యశాల ఆవరణలో, కమిటీ నాయకులతో కలిసి నిరసన తెలియజేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో గొర్ల కాపరులు, పశుపోషకులకు అత్యవసర పశువైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచార పశువైద్యశాల వాహనాలు ప్రస్తుతం దవాఖాన ముందు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయని గొర్రెలు,మేకల పెంపకందారుల సంఘం నాయకులతో కలిసి మాట్లాడారు.

గ్రామాల్లో గొర్రెలు, మేకలు, పశువులకు అనారోగ్యం, అంటువ్యాధులు, ప్రసవ సమస్యలు, అత్యవసర చికిత్స అవసరమైన సందర్భాల్లో వెంటనే వైద్య సేవలు అందకపోవడంతో పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలు, పశువులపై ఆధారపడి జీవించే చిన్న, సన్నకారు పశుపోషకులకు సంచార పశువైద్యశాల వాహనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, అవసరమైన సమయంలో ఈ వాహనాలు గ్రామాలకు రాకపోవడం వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోందని చెప్పారు.

సంచార వాహనాలు పశుపోషకుల సేవలకు వినియోగించకుండా కార్యాలయాల వద్ద నిలిపివేయడం సరికాదని అన్నారు. వాహనాలకు అవసరమైన డ్రైవర్లు, పశువైద్య సిబ్బంది, మందులు, చమురు ఇతర సౌకర్యాలు కల్పించి నిరంతరం గ్రామాల్లో సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలానికి సంచార పశువైద్యశాల వాహనాల సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, 24 గంటల అత్యవసర పశువైద్య సేవలు, ఉచితంగా అవసరమైన మందులు, వ్యాధి నిర్ధారణ, టీకాలు, కృత్రిమ గర్భధారణ వంటి సేవలను గ్రామస్థాయిలో అందించాలని కోరారు. పశువులు, గొర్రెలు, మేకలు చనిపోతే పశుపోషక కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు.

ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే సంచార పశువైద్యశాల వాహనాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉత్సవ విగ్రహాలుగా మారిన సంచార పశువైద్యశాల వాహనాలను పశుసంపద రక్షణకు ఉపయోగపడేలా వెంటనే రోడ్డెక్కించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిక్క గణేష్,కారె రాజు,ఇక్కిరి కిష్టయ్య, జన్నె సిద్దులు,సంగి రాజు,చిన్నం యాదగిరి,మల్లేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -