
– నిర్దేశించిన ప్రాంతంలో వెబ్ కెమెరాలు అమార్చాలి.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
లోక్ సభా ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు అమర్చాలి జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సూచించారు.సోమవారం కలెక్టరేట్ కన్ఫెరెన్సు హాల్ లో నోడల్ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో యస్.పి. రాహుల్ హెగ్డే, ఆదనవు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్. లత లతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థుల ఉప సంహరణ అనంతరం పోటీ లో నిలబడే అభ్యర్థుల ఖరారు కానుండడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను మరింత పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. సువిద పర్మిషన్లు వెంటనే ఇవ్వాలని అలాగే అభ్యర్థులు కొన్ని వాహనాల పర్మిషన్లతో మరికొన్ని వాహనాలు ప్రచారం చేస్తే అట్టి వాహనాలు గుర్తించి కేసులు నమోదు చేయాలని తెలిపారు. దినపత్రికలు, సోషల్ మీడియా లలో వచ్చే వార్తలు, ప్రకటనలు గుర్తించి తగు చర్యలు చేపట్టాలని అన్నారు. నియోజక వర్గాల అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల సిబ్బందితో తరుచుగా మౌలిక వసతుల కల్పనపై సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. అదేవిదంగా విలేజ్ పోలీస్ వాలంటారీ లు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లకు సహాయ సహకారాలు అందించాలని, వేసవి దృష్ట్యా అన్ని కేంద్రాల్లో చల్లటి త్రాగునీరు, ఓ ఆర్ ఎస్ అలాగే మెడికల్ శిబిరాలు ఉండాలని సూచించారు. వెబ్ క్యాస్టింగ్ నిర్దేశించిన ప్రాంతాలలో ఉండాలని అలాగే క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ లలో ఉండాలని తెలిపారు. నల్గొండ, భువనగిరి లలో రెండేసి ఈవీఎంఎస్ వినియోగం లో ఉన్నందున బి.యు లను మల్టిపుల్ ర్యాండమైజేషన్ చేపట్టాలని సూచించారు. క్రిటికల్ ప్రాంతాలలో పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఎం.ఎల్.సి. ఎన్నికల నోటిఫికేషన్ మే 2 న విడుదల తో నామినేషన్ల స్వీకరణ 9న, 27 న పోలింగ్ , జూన్ 5న కౌంటింగ్ ఉంటుందని ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు.తదుపరి యస్.పి. రాహుల్ హెగ్డే మాట్లాడుతూ పోలీస్, సెక్టార్ అధికారులు కేంద్రాలను ముందుగా పరిశీలన చేయాలని సూచించారు. ఎఫ్.ఎస్.టి., ఎస్.ఎస్.టి బృందాలు అభ్యర్థుల సమావేశాలు అలాగే ర్యాలీలు వీడియో తీయాలని వాహనాల అనుమతులు పరిశీలించాలని సూచించారు. ఇప్పటికే క్రిటికల్ ప్రాంతాలు, కేంద్రాల్లో గట్టి నిఘా ఉంచామని సెక్టార్ అధికారులు, పోలీస్ సెక్టార్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.