మొలంగూర్ దామేర చెరువులో వాలకు చిక్కిన వింత చేప

నవతెలంగాణ – శంకరపట్నం
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో మొలంగూర్ గ్రామంలోని దామెర చెరువులో శనివారం చేపల కోసం వల వేసిన కొంతమందికి వింత చేప చిక్కిందని
ఈ చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా అక్వేరియంలో పెరిగే ఈ చేప దురదృష్టవశాత్తు చెరువుల్లో చేరింది. సక్నోస్ క్యాట్ ఫిష్ గా పిలవబడే ఈ చేప ఇతర చేపలను భారీగా ఆహరంగా తీసుకుంటుందన్నారు.దీని శాస్త్రీయ నామం పేటరీగోప్లిచిస్ మల్టీరాడియటస్ లోరికారిడే కుటుంబానికి చెందిన ఈ చేప వాజాలు రెక్కలను పోలి బలంగా ఉంటుంది. సాధారణంగా ఈ చేపలు మంచి నీటి వరద ప్రవాహల్లోను, బురద అడుగు భాగంలోను కఠినమైన వాతావరణాల్లో కూడా మనుగడ సాధిస్తుందని గరిష్టంగా 50 సెంటీమీటర్ల పొడవు పెరుగుతుందన్నారు.
Spread the love