బీజేపీ మండల అధ్యక్షుడిగా మొలుమూరి


నవతెలంగాణ-రామగిరి: రామగిరి బీజేపీ మండల అధ్యక్షుడుగా మొలుమురి శ్రీనివాస్ ను మంథని నియోజకవర్గ ఇన్చార్జి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి నియమించారు. ఈ మేరకు మంథని నియోజకవర్గ అన్ని మండలాల అధ్యక్షులను పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో భాగంగా మొలుమూరు శ్రీనివాస్ మాట్లాడుతూ.. రామగిరి మండల అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించినందుకు అలాగే నాపై నమ్మకం ఉంచి మండల అధ్యక్షుడుగా నియమించినందుకు జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో రామగిరి మండలంలో  పార్టీని విస్తరింప చేస్తూ కేంద్రంలో పేద ప్రజల కోసం అనేక పథకాల ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీ గురించి ప్రజలకు వివరించి మండలంలో పార్టీని బలోపేతం చేస్తూ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.

Spread the love