- Advertisement -
శాన్‌ఫ్రాన్సిస్కో : టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన గేమింగ్ విభాగం ఎక్స్‌బాక్స్ రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమవుతోంది. గత ఐదేండ్ల కాలంలో కంటెంట్, ప్లాట్‌ఫామ్‌లపై దాదాపు 20 బిలియన్ డాలర్లు వెచ్చించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధి లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో జూన్ 30 తర్వాత ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టాలని కంపెనీ యోచిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. గత ఏడాది కూడా మైక్రోసాఫ్ట్ సుమారు 9వేల మంది ఉద్యోగులను తొలగించగా.. అందులో ఎక్స్‌బాక్స్ విభాగానికి చెందిన వారు కూడా ఉన్నారు. అయితే తాజా ఉద్వాసనల్లో ఎంతమంది ఉద్యోగులపై వేటు పడనుందనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది.
- Advertisement -



