అఫ్గానిస్థాన్‌లో భారీ వరదలు.. 300 మందికి పైగా మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: భారీ వర్షాలు అఫ్గానిస్థాన్‌లో విలయం సృష్టిస్తున్నాయి. ఆ దేశంలోని బదాక్షాన్‌, బగ్లాన్‌, ఘోర్‌, హెరాత్‌ ప్రావిన్సుల్లో ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా బగ్లాన్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక్కడ భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటివరకు దాదాపు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఐరాస ఆహార ఏజెన్సీ వెల్లడించింది. వెయ్యికి పైగా గృహాలు ధ్వంసమైనట్లు తెలిపింది. ఆస్తి నష్టం భారీగా ఉందని తాలిబన్‌ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. బదాక్షాన్‌, బగ్లాన్‌, ఘోర్‌, హెరాత్‌ ప్రావిన్సులు దారుణంగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఈ విధ్వంసం భారీ ఆస్తినష్టాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలిస్తున్నాం. బాధితులను రక్షించడం, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడానికి, వరదల ధాటికి మరణించినవారి మృతదేహాలను వెలికితీసేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

Spread the love