– ఎంపీకి ఆలయ అధికారుల ఘన సన్మానం
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండల నివాసులు ప్రస్తుత జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ శనివారం నాడు తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా సరిహద్దులు గల మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఆలయాన్ని సందర్శించిన ఎంపీ బీబీ పాటిల్ కు ఆలయ అధికారి వేణు ప్రత్యేకంగా సన్మానించారు. ఎంపీ ఆలయ సందర్శన కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింలు గౌడ్ బిజెపి నాయకులు కృష్ణ పటేల్ పొతంగల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.