ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుంది: ఎంపీడీఓ

నవతెలంగాణ – గోవిందరావుపేట
ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయుల బోధనలు నాణ్యమైన విద్య లభిస్తుందని ఈ అవకాశాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో జవహర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చల్వాయి గ్రామపంచాయతీ ఆవరణలో జయశంకర్ బడిబాట గ్రామ సభ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీడీవో జవహర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఆటపాటలతో కూడిన విద్యాబోధన ఉంటుంది. కావున ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని కోరడం జరిగింది. పిఎస్ చల్వాయి నందు  ప్రీ ప్రైమరీ సెక్షన్ కలదు కావున ఎల్కేజీ యూకేజీ చదివించే విద్యార్థులను ఆ పాఠశాలలో చేర్పించాలని కోరనైనది. జడ్.పి.హెచ్.ఎస్  చల్వాయి నందు డిజిటల్ బోర్డులతో విద్యాబోధన అత్యంత  ప్రతిభ గల టీచర్లు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి డిజిటల్ టీవీ సౌకర్యం కలదు. అదేవిధంగా అన్ని వసతులు అత్యంత క్రమశిక్షణ గల ఉపాధ్యాయులు చల్వాయి గ్రామపంచాయతీ నందు కల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు పనిచేయుచున్నారు.
కావున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని బడిబాట గ్రామసభలో ఎంపీడీవో గారు ఉద్బోధించడం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక మరియు హై స్కూల్ హెచ్ఎంలు పాల్గొని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రతి మీటింగ్ కు హాజరై పిల్లల చదువులను పర్యవేక్షించాలని   చెప్పడం జరిగింది. తాము అత్యంత క్రమశిక్షణతో ఆటపాటలతో విద్యార్థికి అర్థమయ్యే రీతిలో మానసిక ఉల్లాస  భరితంగా పాఠాలు బోధిస్తామని ఈ బడిబాట గ్రామ సభలో పాల్గొన్న వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెప్పడం జరిగింది. చల్వాయి గ్రామపంచాయతీ పరిధిలోగల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఈనెల 6 నుండి 11 వరకు గ్రామంలోని అన్ని ఇండ్లను సందర్శించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని చెప్పడం జరిగింది.  ఈ సమావేశంలో హెచ్ఎంలు చంద్ర రెడ్డి వాసుదేవ రెడ్డి, నాగేశ్వరరావు, సాంబయ్య వేణు గోపాల్ వెంకట లక్ష్మి, శ్రీనివాస్ గార్లు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ సమావేశంలో ఏపీవో  మరియు కార్యదర్శి భారతి  ఇంకా అంగన్వాడి సూపర్వైజర్ విజయలక్ష్మి, ఆశా వర్కర్లు అంగన్వాడి టీచర్లు గ్రామ పెద్దలు యువకులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
Spread the love