నవతెలంగాణ – రెంజల్
వేసవికాలంలో ఎండలు మండిపోతూ ఉండడంతో, నర్సరీలలోని మొక్కలను కాపాడుకోవడానికి గ్రీన్ నెట్ ను ఏర్పాటు చేయాలని కార్యదర్శి రాజును ఎంపీడీవో శంకర్ ఆదేశించారు. మండలంలోని వీరన్న గుట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని ఆయన పరిశీలించారు. నర్సరీ లలో ఉదయం సాయంత్రం తప్పకుండా నీటిని అందించాలని, మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. నర్సరీని కాపాడడంతోపాటు గ్రామంలోని తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టిని సాధించాలని ఆయన కార్యదర్శిని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్, సూపర్డెంట్ శ్రీనివాస్, టి ఏ, గ్రామ కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు.