ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన హైకోర్టు

నవతెలంగాణ – హైదరాబాద్: మరో రెండు నెలల్లో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి .ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఐటీ శాఖ సీజ్ చేసిన రూ.105 కోట్లను రిలీజ్ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఇటీవల ఐటీ శాఖ కాంగ్రెస్ ఖాతాను ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఖాతాను పునరుద్ధరించినా.. అందులోని రూ.105 కోట్ల ట్యాక్స్ పై నోటీసు జారీ చేసింది. దీనిపై స్టే విధించాలని కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్ పన్ను పెనాల్టీ కేసులో ITAT ఆర్డర్‌తో జోక్యం చేసుకోవడానికి ఢిల్లీ కోర్టు నిరాకరించింది.

Spread the love