
మండల సర్వసభ్య సమావేశానికి వివిధ శాఖల నుండి హాజరుకాని అధికారులపై నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో జవహర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం వైస్ ఎంపీపీ బండారి రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి పిట్టల శ్రీలత, తాసిల్దార్ సదానందం, ఎంపీడీవో జోహార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పిటిసి పిట్టల శ్రీలత మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో మట్టి మాఫియా జరుగుతున్నాయని, వార్తల కథనాల ప్రకారం మైనింగ్ అధికారులను వారి ఆగడాలకు టూతూ మంత్రంగా వ్యవహరించడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు.ఇలాంటి చర్యలు మళ్లీ జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. మహిళ పొదుపు సంఘాలలో నెలకొనియున్న ఆవుకతవకలను, పొదుపులో చెల్లించడంలో సక్రమంగా అందడం లేదని మా దృష్టికి రావడం జరిగిందని, వాటిని వెంటనే చెల్లించేందుకు సత్వర నిర్ణయాలు తీసుకోవాలని మహిళా సంఘాలలో మరికొన్ని అంశాలపై తగిన అవకతవకలను చేసి సరి చేయాలని ఏపిఎం అనితకు సూచించారు. పలు గ్రామాలలో మిషన్ భగీరథ పైపు లీకేజీలు ఎక్కువ ఉంటున్నాయని,వాటిని త్వరితగతిన పరిష్కరించాలని మిషన్ భగీరథ అధికారులకు అనంతరం ఎంపీడీవో జోహారెడ్డి మాట్లాడుతూ సర్వసభ్య సమావేశం దాదాపు 20 రోజుల ముందు నుంచి సమాచారాన్ని అందించిన మీద శాఖల శాఖలపై అధికారులు రాకపోవడం చాలా విచారకరమని మండిపడ్డారు.ఎన్నికల కోడ్ సందర్భంగా ప్రతి ఒక్కరు విధిగా తమ విధులు నిర్వహించేందుకు సమాయత్తం కావలసిన సమయంలో వారు వారి శాఖల్లోని అంశాలను తెలియజేయకపోవడం పట్ల అభివృద్ధి కుంటుపడుతుందని ఆరోపించారు. అధికారులు ప్రజా ప్రతినిధులతో మమేకమే ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలని ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, మీద శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.