నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండల కేంద్రంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం పరిశీలించారు.క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ ప్రక్రియను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాల్కొండ నియోజకవర్గంలో 100 శాతం ఎన్యూమరేషన్‌ను వేగంగా పూర్తి చేయాలని, ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటర్లు కూడా తమ పూర్తి వివరాలను బూతు లెవల్ అధికారులకు అందించి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సర్ ప్రక్రియను పరిశీలించిన ముత్యాల సునీల్ కుమార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



