మండలంలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు

నవతెలంగాణ- గాంధారి

గాంధారి మండల కేంద్రంతో పాటు మనలోని వివిధ గ్రామాల్లో సోమవారం నాగులపంచమి పండుగను పురస్కరించుకొని మహిళలు యువతులు చిన్నారులు ఆలయంలో పుట్టలకు పాలు పోసి ఆలయాల్లో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని శివాలయాల్లో జనం పోటెత్తారు ఆడపడుచులు అన్నదమ్ములకు కండ్లు కడగడం తరతరాలుగా ఆనవాయితీగా కొనసాగుతుంది. పండగను పురస్కరించుకొని మండల కేంద్రంలోని పాల కేంద్రాల్లో జింగురు సురేష్, పత్తి రమేష్ లు ఆవుపాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు.

Spread the love