నవ తెలంగాణ- దామరచర్ల
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) విద్యుత్ ఉత్పత్తిలో ఒక కీలకమైన మైలురాయిని అధిగమిం చింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) ఆధ్వర్యంలో నడుస్తున్న ఒడిశాలోని ‘నైనీ’ బొగ్గు గని నుండి సేకరించిన అత్యంత నాణ్యమైన బొగ్గుతో కూడిన మొదటి రైల్వే రేక్ (రైలు) 4000 టన్నుల బరువుతో మంగళవారం ప్లాంట్‌కు చేరుకుంది. ఈ తొలి బొగ్గు రేక్‌ను టీజీజెన్‌కో డైరెక్టర్ (బొగ్గు అండ్ లాజిస్టిక్స్) బి.నాగ్య, డైరెక్టర్ (థర్మ ల్ అండ్ ప్రాజెక్ట్స్) వై. రాజశేఖర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్లు శ్రీనివాసరావు, సురేష్, సూర్యనారా యణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బొగ్గు రేక్ ముఖ్య విశేషాలు
విద్యుత్ రక్షణకు భరోసా: నైనీ బ్లాక్ నుండి వచ్చిన అధిక నాణ్యత కలిగిన ఈ బొగ్గు, రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చడానికి, గరిష్ట సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఎంతో దోహదపడు తుంది. ఒడిశా నుంచి సుదీర్ఘ దూరం సుమారు 1050 కిలోమీటర్లు రవాణా చేయాల్సి వచ్చినప్పటికీ, ఈ బొగ్గు యొక్క నాణ్యత, అధిక ఉష్ణ సామర్థ్యం కారణంగా బాయిలర్ల పనితీరు మెరుగవుతుంది. ఇది బూడిద సమస్యలను తగ్గించి రవాణా వ్యయాన్ని పూర్తిగా సమర్థిస్తుంది.
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు నైనీ మైన్ తొలి బొగ్గు రేక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



