Wednesday, September 2, 2026
E-PAPER
Homeక్రైమ్యువతి మృతి కేసులో నిందితుడి ఆత్మహత్య

యువతి మృతి కేసులో నిందితుడి ఆత్మహత్య

- Advertisement -

బెయిల్‌పై విడుదలైన కొద్దిరోజులకే ఘటన
సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఘటన
నవతెలంగాణ–సిటీబ్యూరో

షార్ట్‌ఫిల్మ్‌ నటి ఆత్మహత్య కేసులో నిందితుడు ‌బలవన్మరణానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. తనపై, తన కుటుంబ సభ్యులపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారని ఆరోపిస్తూ అతను ఆత్మహత్యకు ముందు వాట్సాప్‌లో సందేశం పంపినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తన ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అందులో కోరినట్టు తెలిసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షార్ట్‌ఫిల్మ్‌ నటి అమూల్య శ్రీ మృతి కేసులో అరెస్ట్‌ అయి జైలుకు వెళ్లిన మేఘావత్‌ నారాయణ్‌ అలియాస్‌ మహేష్‌(19) ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే మంగళవారం సైదాబాద్‌ సింగరేణి కాలనీలోని తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వచ్చాక గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సైదాబాద్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే మహేష్‌పై కావాలనే తప్పుడు కేసు నమోదు చేసి జైలుకు పంపించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని వారు కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -