తప్పుడు సర్టిఫికెట్లతో అనుమతులు పొందిన నారాయణ గుర్తింపును రద్దు చేయాలి 

– ఏఐపిఎస్ యు జిల్లా కార్యదర్శి జ్వాల
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో గల నారాయణ పాఠశాల యాజమాన్యం తప్పుడు  సర్టిఫికెట్లను సమర్పించి 2023-24 ఈ విద్యా సంవత్సరానికి ఓపెనింగ్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి అనుమతులు తీసుకున్న  నారాయణ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐపీఎస్ యు జిల్లా కార్యదర్శి జ్వాల మాట్లాడుతూ నారాయణ కార్పొరేట్ స్కూల్ కి సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించిన ప్రక్రియలు విద్యాశాఖకు వివిధ డిపార్ట్మెంట్ల నుంచి లెటర్లు పెట్టడం జరిగింది, కానీ వాళ్ళు సమర్పించినటువంటి లెటర్లలో 2022- 23 లోనే నారాయణకు పర్మిషన్లు ఉండినట్టు అదేవిధంగా లీజ్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ అవ్వకముందే నారాయణ స్కూల్ కు అనుమతికి సంబంధించినటువంటి సానిటరీ సర్టిఫికెట్ రావడం షోచనీయం. రిజిస్ట్రేషన్ డిడి చూడకుండా ముందుగానే సానిటరీ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు. అదేవిధంగా 2022- 23 అని చెప్పి సర్టిఫికెట్ లో ఉండడం జరిగింది. 2022లో లిబర్టీ స్కూలుకు ప్రస్తుతం నారాయణ స్కూల్ ఉన్న బిల్డింగ్లో పర్మిషన్ ఉండడం జరిగింది. సర్టిఫికెట్లు పరిశీలించి సంతకాలు పెట్టేది హై స్కూల్ కాబట్టి జిల్లా విద్యాశాఖ అధికారి కదా అయినా కానీ అంత నిర్లక్ష్యంగా సానిటరీ సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి. పెట్టినటువంటి ప్రతి సర్టిఫికెట్ కూడా లీజు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ అవ్వకముందు మాత్రమే పెట్టినవి ఉన్నాయి. కనీసం ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని కూడా సర్టిఫికెట్లు పరిశీలించుకోకపోవడం సిగ్గుపడాల్సిన విషయం. ఏదైతే తప్పుడు సర్టిఫికెట్లతో నారాయణ కార్పొరేట్ వ్యవస్థను జిల్లా విద్యాశాఖ అధికారి చొరవ తీసుకురావడం జరిగిందో, దానికి ఓపెన్ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. తప్పుడు సర్టిఫికెట్లతో పెట్టిన ఓపెన్ పర్మిషన్ను తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ జె టి కి సమర్పించాలని వెంటనే ఆ యొక్క నారాయణ కార్పొరేట్ స్కూల్ సీజ్ చేయాలని లేని పక్షంలో వీరి యొక్క సర్టిఫికెట్లు అన్నీ కూడా తీసుకొని తప్పుడుగా సృష్టించుకుని తీసుకువచ్చినయ్ కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని ఆ యొక్క నారాయణ కార్పొరేషన్ ఆపే ప్రసక్తి లేదని దీనికి సంబంధించి ఆర్జెడిని కూడా త్వరలోనే కలుస్తామని తక్షణమే డిఇఓ స్పందించి వెంటనే ఆర్జెడీకి లెటర్ పెట్టాలని ఓపెన్ పర్మిషన్ రద్దు చేయించాలని ఓపెన్ పర్మిషన్ తోనే ఇంతగా చెలరేగిపోయి తప్పుడు సర్టిఫికెట్లకు తెచ్చుకున్నటువంటి వ్యవస్థ మునుముందు ఎన్ని అరాచకాలకు పాల్పడుతారో జిల్లా విద్యాశాఖ అధికారికే వదిలేస్తున్నామని ఆలోచించుకొని అదే విధంగా వారు పెట్టినటువంటి సర్టిఫికెట్లు మొత్తం కూడా జిల్లా విద్యాశాఖ అధికారికి తప్పుడు సర్టిఫికెట్లను రుజువు చేపించి వాటిని అందజేయడం కూడా జరిగింది వాటిపైన చర్యలు తీసుకుంటానని ప్రజావాణిలో హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని లేకపోతే ఈ ఉద్యమం తారస్థాయికి చేరి కచ్చితంగా సీజ్ వరకు ఆగేది లేదని జిల్లా కార్యదర్శి జ్వాల తెలిపారు.
Spread the love