– 24 మందికి 24 మంది ఉత్తీర్ణత
– ఇద్దరు విద్యార్థులకు అత్యధిక మార్కులు
– సగం మంది 500 పైగా మార్కులతో ప్రతిభ
– విద్యార్థులను అభినందించిన హెచ్‌ఎం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని నారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటింది. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ బుధవారం వెల్లడించిన 2026 పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో ఈ పాఠశాల నుంచి పరీక్షలకు హాజరైన 24 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 24 మందికి 24 మంది ఉత్తీర్ణత సాధించడంతో పాఠశాల 100 శాతం ఫలితాన్ని నమోదు చేసింది. పాఠశాలకు చెందిన ఎం. కీర్తి 561 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, ఎస్. సాయి 551 మార్కులతో ద్వితీయ స్థానం సాధించారు. అలాగే పాఠశాలలో సగం మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు సింగపోగు వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు అభినందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించగలరని వారు పేర్కొన్నారు.
నారాయణపురం జెడ్పీహెచ్‌ఎస్‌కు వందశాతం ఫలితాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



