జాతీయస్థాయి పోటీలలో పాల్గొన్న నటరాజ నృత్యానికేతన్ చిన్నారులు

నవతెలంగాణ – ఆర్మూర్  

పట్టణానికి చెందిన నటరాజ నృత్యానికేతన్ చిన్నారులు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచినట్టు నాట్య గురువు బా శెట్టి మృణాళిని  శుక్రవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా లోని చిలకలూరిపేట మండలం లో ప్రగడ రామ్ మోహన్ రావు అద్వర్యంలో జాతీయ స్థాయీ సంస్కృతిక శాస్త్రీయ నృత్య జానపద కార్యక్రమలు 39 వా కళా నిలయం వేదికగా ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు    ఇట్టి కార్యక్రమంలో పట్టణానికి కు చెందిన నటరాజ నృత్య నికేతన్ విద్యార్థీనులు 17 మందీ పాల్గొని వారి నృత్య ప్రదర్శనలతో వీక్షకులను ,కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిధులను న్యాయ నిర్ణేతల మన్ననలు పొందడం తో పాటూ జాతియా స్థాయి విజేతలుగా నిలిచి ప్రతిష్ఠాత్కామైన నాట్య మయూరి అవార్డులతో పాటు సర్టిఫికేట్లు గెల్చుకుని తెలంగాణ రాష్ట్రం యొక్క కీర్తిని పెంచడం తో పాటూ నిజామాబాద్ జిల్లాకే తలమానికంగా నిలిచారు ఇ కార్యక్రమం లో బాగంగా నృత్య గురువు బాశెట్టి మృణాళిని నాట్య విజ్ఞాన్ అనే బిరుదుతో సత్కరించారు ఈ సందర్బంగా నటరాజ నృత్య నికేతన్ సంస్థ వ్యవస్థాపకులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత మాడావేడి నారాయణ గారు నృత్య గురువు, విద్యార్థినుల తల్లిదండ్రులు మాట్లాడుతూ వారి సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో నృత్యానికేతన్ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love