ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS)కి నూతన అధ్యక్షుడిగా రాజ్ అల్లాడ ఎంపికయ్యారు.
2026-2028 సంవత్సరాలకు గాను నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC)ని ప్రకటించింది.
నాట్స్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సంస్థను మరింత అభివృద్ధి దిశగా నడిపిం చేందుకు, సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు మరియు సభ్యు లతో అనుబంధాన్ని బలోపేతం చేయేందుకు రాజ్ అల్లాడాను అధ్యక్షుడిగా ఎన్నుకుంది.
అనుభవం, యువ నాయకత్వం, సేవా దృక్పథం కలగలిసిన ఈ నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా రాజ్ అల్లాడ, వైస్ ప్రెసిడెంట్ (ప్రోగ్రామ్స్)గా రాజేష్ కండ్రు, వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్ అండ్ మార్కె టింగ్)గా అనుదీప్ అర్లా, వైస్ ప్రెసి డెంట్ (సర్వీసెస్)గా రాజ్యలక్ష్మి చిలు కూరి, కార్యదర్శిగా సుధీర్ మిక్కిలి నేని, ఖజాంచీగా రామ్ నరేష్ కొమ్మనబోయిన, జాయింట్ సెక్రటరీగా భాను లంక, జాయింట్ ట్రెజరర్‌గా వెంకట సాకమూరి బాధ్యతలు చేపట్టనున్నారు. వీరందరూ తమ తమ రంగాల్లో విశేష అనుభవంతో పాటు నాట్స్ పట్ల అంకితభావంతో పనిచేస్తూ సంస్థ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లనున్నారు.
న్యూజెర్సీకి చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ రాజ్ అల్లాడ 2009 నుంచి నాట్స్లో వాలంటీర్‌గా సేవలం దిస్తున్నారు. సంస్థలో పలు బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు పలుమార్లు నాట్స్ బోర్డ్ మెంబర్ గా వ్యవహరించారు. ముఖ్యంగా సేవా కార్యక్రమాల పట్ల ఆయన చూపిన నిబద్ధత, కమ్యూనిటీకి ఉపయోగ పడే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనే తపన ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
2023లో డిప్యూటీ కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన న్యూజెర్సీలో జరిగిన నాట్స్ సంబ రాల్లో కీలక పాత్ర పోషించి, అందరి ప్రశంసలు అందుకున్నారు. నిధుల సేకరణలో ఆయన చూపిన చొరవ, వాలంటీర్లను ఒకే లక్ష్యంతో ముం దుకు నడిపించిన తీరు ఆయనకు విశేష గుర్తింపు తీసుకొచ్చింది.
నాట్స్ అధ్యక్షుడి గారాజ్ అల్లాడ
- Advertisement -
- Advertisement -



