సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ 11వ వార్షికోత్సవానికి ఆహ్వానించిన సీజీఎం, ఎడిటర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రత్యామ్నాయ జర్నలిజానికి నవతెలంగాణ దినపత్రిక ప్రతీక అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ కొనియాడారు. నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవానికి రావాలని కోరుతూ బుధ వారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యా లయంలో జాన్‌వెస్లీకి ఆ పత్రిక సీజీఎం పి.ప్రభాకర్, ఎడిటర్ రాంపల్లి రమేశ్, జనరల్ మేనేజర్ లింగారెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. వార్షికోత్సవం సందర్భంగా ‘రాజ్యాంగం-ప్రజాస్వామ్యం-పత్రికాస్వేచ్ఛ’ అంశంపై నిర్వహించనున్న సెమి నార్‌లో ప్రసంగించాలని కోరారు. వార్షికోత్సవానికి వస్తామని జాన్‌వెస్లీ హామీనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రధానస్రవంతిలో ఒక సెక్షన్ మీడియా పాలకవర్గాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను కప్పిపెడుతున్న తరుణంలో నవతెలంగాణ పత్రిక వాస్తవాలను వెలికి తీస్తూ రాయడం గొప్ప విషయమన్నారు. ప్రజా ఉద్యమాలకు నవతెలంగాణ దినపత్రిక అండగా నిలుస్తున్నదని అభినందించారు.
ప్రత్యామ్నాయ జర్నలిజానికి ప్రతీక నవతెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



