పనులను సకాలంలో పూర్తి చేయాలి: నవీన్ కుమార్

నవతెలంగాణ –  జమ్మికుంట
అమ్మ ఆదర్శ పాఠశాలలో నాణ్యతతో కూడిన పనులను సకాలంలో పూర్తి చేయాలని ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్, ప్రత్యేక అధికారి నవీన్ కుమార్ అన్నారు. సోమవారంజమ్మికుంట పట్టణ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో గల ఉన్నత పాఠశాల , ప్రాథమిక పాఠశాల బాలురు, ప్రాథమిక పాఠశాల బాలికలు , ఆబాది ఎస్సీ కాలనీ పాఠశాలలను   నవీన్ కుమార్ అమ్మ ఆదర్శ పాఠశాలల పని తీరుపై సందర్శించి , పరిశీలించారు.ఏ ఈ తో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు అన్ని పనులను పూర్తిస్థాయి నాణ్యతతో పాఠశాలలు బాగుపడే విధంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పని చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రధానోపాధ్యాయులతో మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్యను తప్పకుండా పెంచే  ప్రయత్నం చేసి , పనులను  కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తు ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ మాట్లాడుతూ అర్బన్ పరిధిలో గల అన్ని పాఠశాలల్లో కరెంటు పనులు, టాయిలెట్ రిపేర్లు, నీటి వసతి ఏర్పాట్లు, మేజర్, మైనర్ రిపేర్లు జరుగుచున్నా యని తెలిపారు. ప్రతిరోజు వీటి యొక్క వివరాలను జిల్లాకు తెలపడం జరుగుతుంది అని అన్నారు. మున్సిపల్  అసిస్టెంట్ ఇంజనీర్ వరుణ్ కుమార్ మాట్లాడుతూ ఉన్నతాధికారులు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అన్నిటిని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ, పనులు చేపట్టడం జరుగు తుందని ,ఇచ్చిన గడువు కంటే ముందుగానే పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని  తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జంపాల పద్మ, పూర్ణచందర్, మనెమ్మ, మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ ఆకాష్, సాయి, పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మౌనిక, స్వరూప,షమీమ్ బేగం ,సీఆర్పీలు సురేష్ ,రవి, గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు.
Spread the love