నవతెలంగాణ-కామారెడ్డి : నవతెలంగాణ రామారెడ్డి మండల విలేకరిగా పనిచేస్తున్న తిరుపతిని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ బుధవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. తిరుపతి ఇటీవల ప్రమాదవశాత్తు పొలం వద్ద జారి పడటంతో చేతి ఎముకకు సర్జరీ జరిగింది. విషయం తెలుసుకున్న విప్ ఇంటికెళ్ళి పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు.