హైదరాబాద్‌లో భారత్‌, అఫ్గాన్‌ టీ20?

హైదరాబాద్‌ : 2024 జనవరి హైదరాబాద్‌ క్రికెట్‌ ప్రియులకు మరింత కిక్‌ ఇవ్వనుంది. జనవరి 25 నుంచి భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి టెస్టు హైదరాబాద్‌లో జరుగనుండగా.. ఇప్పుడు మరో మ్యాచ్‌కు సైతం ఉప్పల్‌ వేదిక కానుంది. డిసెంబర్‌ 3న హైదరాబాద్‌లో జరగాల్సిన భారత్‌, ఆస్ట్రేలియా చివరి టీ20 మ్యాచ్‌ బెంగళూర్‌కు మార్చారు. జనవరి 17న బెంగళూర్‌లోని జరగాల్సిన భారత్‌, అఫ్గనిస్థాన్‌ మూడో టీ20 మ్యాచ్‌ను హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడి మ్యాచ్‌ను భద్రతా కారణాలతో బెంగళూర్‌కు తరలించగా.. అక్కడి మ్యాచ్‌ను హైదరాబాద్‌కు కేటాయించేందుకు బీసీసీఐ ఆలోచన చేస్తోందని సమాచారం.

Spread the love