సీమా బిస్లపై వేటు

– ఏడాది నిషేధం వేసిన నాడా
న్యూఢిల్లీ : టోక్యో ఒలింపియన్‌, ఆసియా చాంపియన్‌షిప్స్‌ కాంస్య పతక విజేత సీమ బిస్లపై వేటు పడింది. జాతీయ డోపింగ్‌ నిరోధక ఏజెన్సీ (నాడా) నిబంధనలను అతిక్రమించిన కారణంగా సీమా బిస్లపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ యాంటీ డోపింగ్‌ డిసిప్లినరీ ప్యానల్‌ (ఏడీడీపీ) ఆదేశాలు జారీ చేసింది. 30 ఏండ్ల సీమ నిషేధం మే 12 నుంచి అమల్లోకి రానుంది. 2021 ఆసియా చాంపియన్‌షిప్స్‌లో ఫ్రీ స్టయిల్‌ 50 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గిన సీమా.. టోక్యోలో అదే విభాగంలో నిరాశపరిచింది. ఎక్కడ ఉన్నామనే సమాచారం ఇవ్వకపోవటం, టెస్టులకు శాంపిల్స్‌ ఇవ్వలేదని సీమా బిస్లపై నాడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.

Spread the love