సెమీస్‌లో సింధు, లక్ష్య

– క్వార్టర్స్‌లో అలవోక విజయాలు
– కెనడా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
న్యూఢిల్లీ : భారత స్టార్‌ షట్లర్‌ పి.వి సింధు, లక్ష్యసేన్‌ కెనడా ఓపెన్‌లో సత్తా చాటుతున్నారు. మహిళల సింగిల్స్‌లో సింధు, పురుషుల సింగిల్స్‌లో సేన్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో పి.వి సింధు వరుస గేముల్లో గెలుపొందింది. చైనా అమ్మాయి ఫాంగ్‌ జిపై 21-13, 21-7తో ఏకపక్ష విజయం సాధించింది. 44 నిమిషాల్లోనే సెమీస్‌కు చేరుకున్న సింధు.. చైనా షట్లర్‌ను చిత్తు చేసింది. తొలి గేమ్‌ను 21-13తో నెగ్గిన సింధు.. రెండో గేమ్‌లో మరింత రెచ్చిపోయింది. ఏకంగా వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించి దుమ్మురేపింది. చైనా షట్లర్‌ నుంచి సింధుకు కనీస పోటీ ఎదురుకాలేదు. సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌, జపాన్‌ షట్లర్‌ అకానె యమగూచితో సింధు తలపడనుంది. మెన్స్‌ సింగిల్స్‌ క్వార్టర్స్‌లో లక్ష్యసేన్‌ మూడు గేముల్లో నెగ్గాడు. 21-8, 17-21, 21-10తో బెల్జియం ఆటగాడిపై పైచేయి సాధించాడు. తొలి గేమ్‌ను సులువుగా నెగ్గిన సేన్‌.. రెండో గేమ్‌లో తడబడ్డాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో దూకుడు చూపించి సెమీస్‌ బెర్త్‌ దక్కించుకున్నాడు. సెమీఫైనల్లో జపాన్‌ షట్లర్‌ కెంట నిషిమోటతో లక్ష్యసేన్‌ ఢకొీట్టనున్నాడు.

Spread the love