బృందాలుగా కరీబియన్‌ దీవులకు..

12 నుంచి టెస్టు సిరీస్‌ షురూ
న్యూఢిల్లీ : కరీబియన్‌ పర్యటనకు భారత జట్టు బయల్దేరింది. ఈ నెల 12 నుంచి తొలి టెస్టుతో ఐదు రోజుల ఆట షురూ కానుండగా.. వైట్‌బాల్‌ సిరీస్‌ సైతం ఆ తర్వాత కొనసాగనుంది. టెస్టు, వన్డేలకు ఇప్పటికే జట్లను ఎంపిక చేయగా.. టీ20 సిరీస్‌కు జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. వెస్టిండీస్‌కు ఒకే విమానంలో క్రికెటర్లకు టికెట్లు అందుబాటులో లేకపోవటంతో.. బీసీసీఐ బృందాలుగా అక్కడికి పంపిస్తోంది. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె సహా పలువురు క్రికెటర్లు శుక్రవారం కరీబియన్‌ దీవులకు చేరుకున్నారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలు వరుసగా పారిస్‌, లండన్‌ నుంచి వెస్టిండీస్‌కు చేరుకోనున్నారు. టెస్టు సిరీస్‌ ఆరంభానికి పది రోజులు ముందుగా ఇతర క్రికెటర్లు చేరుకోనుండగా.. కుటుంబంతో హాలిడే ట్రిప్‌లో ఉన్న రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి వారం రోజుల ముందు అక్కడికి వెళ్లనున్నట్టు సమాచారం.

Spread the love